Tuesday, 30 October 2018

ఎన్నికల ప్రేత్యేక చెక్ పోస్ట్ తనిఖీలలో నగదు లభ్యం

 కొమురంభీం ఆసిఫాబాద్  రెబ్బెన అక్టోబర్  30 :  రెబ్బెన మండలం లోని గోలేటిక్రాస్ రోడ్ వద్ద ఎన్నికల నిమిత్తం  నిమిత్తం  ఏర్పాటు చేసిన ప్రత్యేక చెక్ పోస్ట్లో మంగళవారం వాహనాల తనిఖీల్లో రెండు వేరు వేరు ఘటనల్లో మొత్తం 42.88  లక్షల నగదును పోలీసులు పట్టుకున్నారు.  ముందుగా గోలేటి  నుండి రెబ్బెన వైపు వెళ్తున్న కావూరి రాజేందర్ గౌడ్ ద్విచక్ర వాహనంలో రూపాయలు 2,88,500 లక్షల నగదును తరలిస్తుండగా పోలీసులు తనిఖీల్లో బయటపడ్డాయి.  పట్టుబడిన నగదుకు సంబంధించిన ఎలాంటి పత్రాలు అందుబాటులో లేకపోవడంతో నగదును స్వాధీనం చేసుకుని తహశీల్దార్ సయ్యద్ ఇంతియాజ్ కు సమాచారం అందించారు. పట్టుబడిన  నగదునుసీజ్ చేసినట్లు  తెలిపారు.  బొలెరో వాహనంలో తరలిస్తున్న40 లక్షల నగదును పోలీసులు స్వాధీన పరుచుకున్నారు. మంచిరియల్  నుండి సిర్పూరు యు వెళ్తున్న నగదును పోలీసులు తహశీల్దార్ ఇంతియాజ్, సి ఐ రమణమూర్తి ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు.  పట్టుబడిన నగదును  తెలంగాణ గ్రామీణ బ్యాంకు నుండి సిర్పూర్ యు బ్రాంచ్ కు   తీసుకువెళ్తున్నట్టు తెలవడంతో నగదును వదిలేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై దికొండ రమేష్,  ఎస్సై దేవ్ రావ్,   ఆర్ ఐ  ఊర్మిళ, రెవెన్యూ  అధికారులు, పోలీస్ సిబ్బంది ఉన్నారు. 

No comments:

Post a Comment