Wednesday, 31 October 2018

రిటైరయినా ఉద్యోగులుకు సన్మానం

  కొమురంభీం ఆసిఫాబాద్  రెబ్బెన అక్టోబర్  31 : సింగరేణి  కంపెనీ లో 42 సంవత్సరాల పాటు సుధీర్ఘ కాలం సేవలందించిన శ్రీ టి. రాజేశ్వరరావు, హెడ్ ఓవర్ మెన్ పదవి విరమణ సందర్భంగా డోర్లి ఒసిపి.1 నందు ఘన సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో ప్రాజెక్ట్ అధికారి శ్రీ పురుశోత్తం రెడ్డి  మాట్లాడతూ టి. రాజేశ్వరరావు  శేష జీవితం ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకున్నారు మరియు టర్మినల్ బెనిఫిట్స్  ద్వారా వచ్చిన డబ్బులను పొదుపు చేసుకొని సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. . ఈ కార్యక్రమం లో గని మెనేజర్ శ్రీ ఉమాకాంత్ , ప్రాజెక్ట్ ఇంజనీర్ సీతారామం , ఇంజనీర్లు చుక్కయ్య, వసంత్ కుమార్, వేణుగోపాల్ రావు, తేజ, సంక్షేమాధికారి వేణు, డి వై మేనేజర్లు సుమన్, సునీల్, అండర్ మెనేజర్ శ్రీరాములు ,సర్వే ఆపీసర్ రామ్మోహన్ ,తె.బొ.గ. సం పిట్ సెక్రెటరి డి. నర్సింగరావు, జి. ఎం. స్ట్రక్చర్ కమిటీ సభ్యుడు ఎం. సమ్మయ్య, ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గోన్నారు. అనంతరం శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి (జాతీయ ఐక్యత దినోత్సవం) సందర్భంగా “జాతీయ ఐక్యత ప్రతిజ్ణ” కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

No comments:

Post a Comment