Sunday, 14 October 2018

ప్రజా సమస్యల పరిష్కారంలో పోలీస్ ముందుంటుంది

కొమురంభీం ఆసిఫాబాద్ (రెబ్బెన)  అక్టోబర్  14 : ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు  పోలీసు ముందుంటుందని అదేవిధంగా మండలంలోని ,రైతుల సమస్యలు పరిష్కరించేందుకు వట్టివాగు నీటికి రైతులు ఇబ్బంది పడటంతో వాటి కాలువను మరమ్మతులు చేపట్టామని . డి ఎస్ పి   సత్యనారాయణ అన్నారు ఆదివారం వట్టివాగు కాలువల పూడిక తీత  పని ప్రదేశాలలో  ఆయన  పర్యటించి మాట్లాడారు సాగునీరందక ఏ రైతు పంటలు పంటలను నష్టం నష్టపోవద్దని ఉద్దేశ్యంతో డి బి ఎల్ సంస్థ  సహకారంతో  పూడిక పనులు  చేపట్టామన్నారు గత నాలుగు రోజుల పాటు చేపట్టిన పూడికతీత పనులతో దాదాపు తొంభై శాతం సమస్యకు పరిష్కారాలు లభించిందన్నారు ఆయకట్టురైతులు ఇకపై నీటి వినియోగం విషయంతో  సంబంధిత అధికారులతో మాట్లాడి సామరస్యపూర్వక వాతావరణంలో చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సాగునీరు అందక రైతులు కొంత మేరకు పంటలను నష్టపోయిన దాదాపు తొంభై శాతం పంట చేతికి అందుతుందన్నారు.     భవిష్యత్తులో రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే పోలీసులను సంప్రదించాలని రైతులకు అండగా నిలిచి సమస్యలు పరిష్కారానికి కృషిచేస్తామన్నారు రైతులందరూ సమైక్యంగా  ఉన్నప్పుడే దేశంలో సుభిక్షంగా  ఉంటుందని అన్నారు పూడికతీత పనులకు సహకరించిన డీపీఎల్ కంపెనీ అధికారులు  సంజయ్,  రమాకాంత్ లను శాలువలతో సన్మానించారు ఈ కార్యక్రమంలో రెబ్బెన సిఐ రమణమూర్తి ఎస్సై దికొండ రమేష్ ,సింగిల్ విండో డైరెక్టర్ మదనయ్య తదితర రైతులు ఉన్నారు. 

No comments:

Post a Comment