Thursday, 11 October 2018

గుర్తు తెలియని రైలు కింద పడి వ్యక్తి మృతి

 కొమురంభీం ఆసిఫాబాద్  రెబ్బెన అక్టోబర్ 11: రెబ్బెన మండలం దేవుల గూడా గ్రామానికి చెందిన జాదవ్ రమేష్ (33) బుధవారం రాత్రి రేపల్లెవాడ ఆసిఫాబాద్ రైల్వే టాక్ పై గుర్తు తెలియని రైలు కింద పది ఆత్మహత్య చేసు కున్నాడని జి అర్  పి హెడ్  కానిస్టేబుల్ సత్తయ్య తెలిపారు. జాదవ్ రమేష్ రెబ్బెన మండల దేవుల గూడా గ్రామానికి చెందిన వాడని, గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతు, జీవితం మీద విరక్తితో ఈ చర్యకు పాల్పడి ఉండవచ్చని తెలిపారు. మృతునికి భార్య, కుమార్తె లు ఉన్నారు.

No comments:

Post a Comment