కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; అక్టోబరు 7 ; బతుకమ్మ చీరల పంపిణీని అడ్డుకోవడం సరికాదని జిల్ల మహిళా అధ్యక్షురాలు, ఆసిఫాబాద్ మార్కెట్కమిటీ ఉపాధ్యక్షులు కుందారపు శంకరమ్మ అన్నారు. ఆదివారం రెబ్బెన మండలంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ తెరాస అధ్యక్షులు మన ముఖ్య మంత్రి కెసిఆర్ బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులకు చీరల పంపిణీని గత సంవత్సరం ప్రారంభించారని, కానీ ఈ సంవత్సరం పంపిణీకి సిద్ధంగా ఉన్న చీరలను కాంగ్రెస్ పార్టీ వారు ఎన్నికలను సాకుగా చూపి అడ్డుకోవడం భావ్యం కాదని, తెరాస పార్టీ అమలు చేసిన, చేస్తున్న ప్రజా సంక్షేమ పధకాలను చూసి ఓర్వలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ఈ సమావేశం లో రెబ్బెన మాజీ సర్పంచ్ పెసర వెంకటమ్మ, టౌన్ మహిళా అధ్యక్షురాలు మన్యం పద్మ , ప్రధాన కార్యదర్శి అన్నపూర్ణ అరుణ, నాయకులూ కాలివేణి లక్ష్మి, రాజేశ్వరి, జి లక్ష్మి, పద్మ, జయ, లత, దేవి, రజిత,తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment