కొమురంభీం ఆసిఫాబాద్ అక్టోబర్ రెబ్బెన 10 :ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనేనని అలాంటి జాతీయ పార్టీని అధికారంలోకి తీసుకు రావడం ప్రతి ఒక్క కార్యకర్త మీద ఉన్నాదని మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. బుధవారం రెబ్బెన మండలం గోలేటి లో ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ లో చేరికలు గోలేటి లో కాంగ్రెస్ పార్టీలో చేరిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టువంటి మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, డిసిసి ప్రధాన కార్యదర్శి విశ్వ ప్రసాద్ రావు ఆధ్వర్యంలో ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ లో చేరికలు కార్యక్రమంలో భాగంగా విచ్చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే అత్రం సక్కు, విశ్వ ప్రసాద్ రావులకు గోలేటి లోని నాయకులు మహిళలు యువత స్వాగతం పలికారు. గోలేటి విలేజ్ నుండి సభ ప్రాంగణం వరకు పాదయాత్రలో పాల్గొన్న నాయకులు, యువకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేశారు. అనంతరం బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కేసరి కిషన్ గౌడ్, మద్దెల సురేందర్ రాజ్ ఎంపిటిసి బిజెపి టి పి టి పి జి ఎస్ నల్లగొండ సదాశివ్ చారి బిజెపి కార్యకర్త పస్థం పోశం సిపిఐ మాజీ ఉపసర్పంచ్ కొత్త రాజయ్య రాజయ్య యువ నాయకులు పార్వతి ప్రసాద్ సొంటికి ప్రకాష్, వెలిశాల శివకుమార్ మరియు50మంది ఇతర నాయకులకు డీసీసీ ప్రధాన కార్యదర్శి విశ్వ ప్రసాద్ రావు మరియు మాజీ ఎమ్మెల్యే అత్రం సక్కు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు . కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావడం చారిత్రక అవసరమని అన్నారు. అంతవరకు నాయకులు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన మండల ప్రెసిడెంట్ ముంజం రవీందర్, ఎంపిటిసి శ్రీనివాస్, దుర్గం రాజేష్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ వెంకటేశం చారి యువ నాయకులు దేవరకొండ సంతోష్, పల్లాస్ బానయ్య, వమాన్ ఇతర నాయకులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment