కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; అక్టోబరు 7 ; కొమరం భీం జిల్లా రెబ్బన మండల ఇంద్రా నగర్ గ్రామంలో శ్రీ కనకదుర్గ దేవి, స్వయంభూ శ్రీ మహంకాళి ఆలయం లో ఈ నెల 10 తేదీ నుండి 18 తేదీ వరకు నవరాత్రి మహోత్సవాలు జరుగుతాయని ఆలయ కమిటీ అధ్యక్షుడు మొడేం తిరుపతి గౌడ్, ఉపాధ్యక్షులు కొట్రంగి శ్రీనివాస్, ఆలయ పూజారి దేవార వినోద్ లు ,తెలిపారు. నవరాత్రుల ఉత్సవాలకు కనక దుర్గ దేవి ఆలయాన్నిసర్వాంగ సుందరంగా ముస్తాబుచేసున్నామని, ఆలయం.వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందీ కలగకుండా సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సందర్భంగా దసరా నవరాత్రుల్లో నిత్యాా అన్నదాన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.
No comments:
Post a Comment