కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన అక్టోబర్ 29 ; సంఘవ్యతిరేక కార్యక్రమాలకు ప్రజలు దూరంగా ఉండాలని ఆసిఫాబాద్ డి ఎస్ పి సత్యనారాయణ అన్నారు. రెబ్బెన మండలం లోని ఎడవల్లి గ్రామం లో జిల్లా ఎస్ పి ఆదేశాలమేరకు సోమవారం డి ఎస్ పి ఆధ్వర్యంలో రెబ్బెన సర్కిల్ ఇన్సపెక్టర్ రమణమూర్తి నేతృత్వంలో ఎస్సై దీకొండ రమేష్ సిబ్బందితో కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డి ఎస్ పి మాట్లాడుతూ గ్రామాలలో నిషేదిత గుట్కాలు అమ్మరాదన్నారు. బెల్ట్ షాపులు నిర్వహించరాదని అన్నారు. మద్యం సేవించి వాహనాలను నడపరాదన్నారు. వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించి ప్రమాదాలను నివారించాలన్నారు. గ్రామంలోని దుకాణాలలో 6 వేల విలువగల నిషేదిత గుట్కా,పొగాకు ఉత్పత్తులు లభ్యమయ్యాయని, నిషేదిత వస్తువులు అమ్ముతున్న ఇద్దరిపై కేసు నమోదుచేసినట్లు తెలిపారు. సరైన ధ్రువ పత్రాలులేని 50 మోటారుసైకిల్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. లైసెన్స్ లేకుండా వాహనాలను నడుపుతున్న వారికి జరిమానాలు విధించినట్లు తెలిపారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ప్రజలు పోలీసులకు సహకరించాలని అన్నారు.
No comments:
Post a Comment