మహాత్ముని సూక్తిని ప్రతి ఒక్కరు పాటించాలి ; తహశీల్ధార్ సాయన్న
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; అక్టోబరు 2 ; ప్రతి మనిషి సాటి మనిషికి ఎంతో కొంత మేలు చేయాలి అన్న మహాత్ముని సూక్తిని ప్రతి ఒక్కరు పాటించాలని రెబ్బెన తహశీల్ధార్ సాయన్న అన్నారు . మంగళ వారం స్థానిక రెబ్బన తహశీల్ధార్ కార్యాలయములో జాతి పిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు . గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేశారు . ఆయన మాట్లాడుతూ ఈనాటి యువత సత్ప్రవర్తనతోనే దేశప్రగతి ముడిపడి ఉందని అన్నారు. . నవ సమాజములో యువత పాత్ర చాల ముఖ్యమని , క్రమశిక్షణతో ఉండాలని , సమాజానికి పనికి వచ్చే పనులు చేయాలని తెలిపారు . ఈ కార్య క్రమములో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది ,రెవిన్యూ ఇనస్పెక్టర్ ఊర్మిళ , సెనిర్ అసిస్టెంట్ లక్ష్మీనారాయణ, మండల కో ఆప్షన్ సభ్యులు జాకిర్ ఉస్మాని, బొమ్మినేని సత్యనారాయణ, వి ఆర్ ఓ మల్లేష్, శ్రీనివాస్, జహూర్, స్థానిక నాయకుల తదితరులు ఉన్నారు .
No comments:
Post a Comment