కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; అక్టోబరు 4 ; మండల కేంద్రంలో జరిగిన బస్సు ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయని రెబ్బెన ఎసై దీకొండ రమేష్ గురువారం తెలిపారు. తెలిపిన వివరాల ప్రకారం మంచిర్యాల నుండి ఆసిఫాబాద్ వెళ్తున్న ఆర్ టి సి బస్సు నెంబర్ ఏ పి 01వై 3162 ను మండల కేంద్రంలో ఇందిరానగర్ చెందిన వారణాసి సమ్మయ్య ఎక్కుతుండగా బస్సు డ్రైవర్ రాజేశం ముందుకు కదిలించడంతో సమ్మయ్య చేయి బస్సు ముందు చక్రం కిందపడి నలిగి తీవ్ర రక్త స్త్రావం కావడంతో వెంటనే సర్కిల్ ఇన్స్పెక్టర్ రమణ మూర్తి స్పందించి హాస్పిటల్ కు తరలించినట్లు తెలిపారు. బస్సు డ్రైవర్ రాజేశం పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
No comments:
Post a Comment