కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన అక్టోబర్ 26 ; రెబ్బెన మండలం సింగల్ గూడ గ్రామంలో శుక్రవారం మద్యపాన నిషేధ శాఖ అధికారులు దాడి చేసి గుడుంబా తయారీ స్థావరాలను ధ్వంసం చేసినట్లు ఆబ్కారీ సర్కిల్ ఇన్సపెక్టర్ మౌసీన్ అలీ తెలిపారు. జిల్లా ఆబ్కారీ అధికారి రాజ్యలక్ష్మి ఆదేశానుసారం ఈ దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఈ దాడులలో గుడుంబా తయారీకి వాడే 80 కిలోల బెల్లం,100 లీటర్ల బెల్లం పానకం , 20 లీటర్ల గుడుంబా, 24 90 ఎం ఎల్ ఆఫీసర్ ఛాయస్, 5 బీర్ బాటిళ్లను ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటువంటి నిషేదిత మద్యాలను తయారీ చేయకూడదని అన్నారు. చట్టాన్ని అధిగమించిన వారికి కఠిన శిక్షలు ఉంటాయని అన్నారు. ఈ దాడులలో ఎస్సై విజయలక్ష్మి, హెడ్ కాన్స్టేబుల్ అశోక్, ఇస్ఫాక్ ఖురేషి, రమేష్, కిరణ్, సురేష్, రవి , తిరుపతి , నాగరాజు, మమతా, తిరుపతి పాల్గొన్నారు.
No comments:
Post a Comment