కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; అక్టోబరు 2 ; పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా రెబ్బెన మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై ఉన్న గుంతలను మంగళ వారం రెబ్బెన సర్కిల్ ఇన్స్పెక్టర్ రమణ మూర్తి, ఎస్సై దీకొండరమేష్ లు ఆటో డ్రైవెర్ యూనియన్ సభ్యుల సహకారంతో ప్రమాదకరంగా మారిన గుంతలను సిమెంట్ కాంక్రీట్ తో మరమ్మతు చేశారు. వర్షాకాలంలో ప్రధాన రహదారిపై గుంతలు ఏర్పడడంతో వాహనదారులు ప్రమాదాలకు గురి అవడాన్ని గమనించిన పోలీస్ లు స్థానిక ఆటో డ్రైవర్ల సహకారంతో రహదారిపై ఉన్న గుంతలను మరమ్మతులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువత, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment