Monday, 8 October 2018

ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో బొడ్డెమ్మ సంబారాలు




 రెబ్బెన ;  రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామ పంచాయతీ మరియు రెబ్బెన గ్రామ పంచాయతీలో  12 సంవత్సరాల లోపు పిల్లలతో ఈ నెల 8 నుంచి 10 వరకు బొడ్డెమ్మ పండుగ ను సోమవారం ఆసిఫాబాద్ ఐసీడీఎస్  ప్రాజెక్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు.  ఈ సందర్భంగా  ఐసీడీఎస్ సీడీపీఓ  కవిత  మాట్లాడుతూ ఈ సంబరాల ద్వారా పిల్లలకు పరిశుభ్రత, పోషకాహారం, ఆరోగ్యం, రక్తహీనత పై అవగాహన కల్పించారు. ఆకుకూరగాయలు, పండ్లు, పాలు, గుడ్లు, ప్రతిరోజూ తీసుకోవాలని అన్నారు.వ్యక్తిగత పరిశుభ్రతకు భోజనం చేసే ముందు చేతులను శుభ్రంగా కడుగుకోవాలని అన్నారు.  ఈ ఆట,పోటీలలో   పాల్గొని విజయం సాధించిన వారికి బహుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఐసీడీఎస్ సూపర్ వైజర్ చిట్టెమ్మ, సరోజ, తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment