Saturday, 27 October 2018

గ్రామ పంచాయతీ సిబ్బందికి వెంటనే వేతనాలు చెల్లించాలి ; భోగే ఉపేందర్

 కొమురంభీం ఆసిఫాబాద్  రెబ్బెన అక్టోబర్ 27 ;  తెలంగాణ గ్రామ పంచాయతీ కార్మికులకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించి నెలనెలా వేతనాలు చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ అన్నారు. శనివారం రెబ్బెన  లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతంలో కూడా పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ముప్పై మూడు రోజులు కార్మికులు సమ్మె చేపట్టారని అప్పటికి ప్రభుత్వం ఇలాంటి సమస్యను తీర్చలేదని పంచాయతీ కార్మికులకు గత ఆరు నెలల నుంచి జీతాలు చెల్లించడం లేదని దీంతో కార్మికులు పస్తులుండాల్సిన పరిస్థితి దాపురించిందని  జీతభత్యాలు లేకుండా విధులు నిర్వహిస్తూ నానా ఇబ్బందుల పడుతున్నారని అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు గ్రామపంచాయతీల కార్మికులను పర్మనెంట్ చేస్తామని ఎన్నికల మానిఫెస్టోలో  పెడుతున్నప్పటికీ వారి సమస్యలను పట్టించుకోవడంలేదన్నారు.  అలాగే కనీస వేతనం 18000  వేల రూపాయలు ఇవ్వాలని కార్మికుల కార్మికులందరికీ ఈ ఎస్ ఐ , పి  ఎఫ్  సౌకర్యం కల్పించాలని ఉద్యోగ భద్రత  కల్పించాలన్నారు.  ప్రతి నెలా వేతనాలు చెల్లించే విధంగా ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు సమస్యలు తీరని  పక్షంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో  ఆందోళన చేపడతామని అన్నారు ఈ నెల  ముప్పై ఒకటిన  ఏఐటీయూసీ  తొంభై తొమ్మిది వ ఆవిర్భావ దినోత్సవం ఉంటుందని జిల్లాలోని కార్మికులు, అసంఘటిత కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చే చేయాలని కోరారు ఈ సమావేశంలో గ్రామ పంచాయితీ వర్కర్ యూనియన్ మండల ప్రెసిడెంట్  రమేష్, మండల  కార్యదర్శి దుర్గం వెంకటేష్, ఉపాధ్యక్షులు గొర్ల శంకర్, సహాయ కార్యదర్శి పోశం తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment