కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన అక్టోబర్ 31 : ఏఐటీయూసీ పోరాడి సాధించిన కార్మిక చట్టాలను అమలు చేయడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమైందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ అన్నారు,బుధవారం ఏఐటీయూసీ 99వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రెబ్బన మండలంలో ఘనంగా నిర్వహించారు. మండలంలోని ఏఐటీయూసీ జెండాను గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షుడు రాచకొండ రమేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బోగే ఉపేందర్ మాట్లాడుతూ1920 అక్టోబర్ 31 ముంబయి లో ఏఐటీయూసీ అవిర్భహించిందని ,దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో,తెలంగాణ రాష్ట్ర సాధనలో ఏఐటీయూసీ కీలకపాత్ర పోషించిదని,నాటి నుండి నేటి వరకు కార్మిక హక్కుల కోసం, ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసిందని అన్నారు,కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను,హక్కులను, అమలు చేయకుండా శ్రమదోపిడికి గురిచేస్తున్నారని అన్నారు.దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు,కార్మికులను కనీస వేతనం 18000 ఇవ్వాలని,ఈ ఎస్ ఐ , పి ఎఫ్ సౌకర్యం కల్పించాలని అన్నారు,కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేయాలని,బోనస్ చెల్లించాలని, గ్రామ పంచాయతీ కార్మికులకు నెల నెలా వేతనాలు ఇవ్వాలని అలాగే ముఖ్యమంత్రి హామీ మేరకు నెలకు రూపాయలు 8500 ఇవ్వాలని,అలాగే ఆటో డ్రైవర్సుకుప్రమాద భీమా 10 లక్షలు ఇవ్వాలని,ఇన్సూరెన్స్ ప్రీమియం ను ప్రభుత్వమే భరించాలని అన్నారు ఐ ప్పటికైనా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో ప్రభుత్వాలపై పోరాటాలు చేస్తామన్నారు.. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు రాయిల్లా నర్సయ్య, సీపీఐ రెబ్బన కార్యదర్శి రామడుగుల శంకర్,గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల కార్యదర్శి దుర్గం వెంకటేష్,ఉపాధ్యక్షుడు గోగర్ల శంకర్,లాలూ సింగ్,ప్రకాష్,ఆటో వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ రాజగౌడ్,కార్యదర్శి మహేష్,నాయకులు కే. శ్రీనివాస్,సతీష్,చోటు లతోపాటు తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment