Thursday, 11 October 2018

ఈవీఎం యంత్రాల పై అవగాహన

ఈవీఎం యంత్రాల పై అవగాహన పెంచుకొని ఓటు హక్కు ను వినియోగించుకోవాలి  
కొమురంభీం ఆసిఫాబాద్  రెబ్బెన అక్టోబర్ 11: ప్రతి ఒక్కరు ఈవీఎం యంత్రాల పై అవగాహన పెంచుకొని ఓటు హక్కు ను వినియోగించుకోవాలని  జిల్లా ఉద్యానవన అధికారి స్పెషల్ ఆఫీసర్ మెహర్ బాషా అన్నారు. గురువారం మాధవాయిగూడ ,తుంగేడ గ్రామప్రజలకు  ఎన్నికలలో ఉపయోగించే ఈ వి   ఎం, వి వి ఫాట్ యంత్రాలపై  గ్రామపంచాయతీ కార్యాలయం లో అవగాహన కార్యక్రమానికి  ముఖ్య అతిధి గాహాజరయ్యారు. . ఈ సందర్భంగా రెబ్బెన రెవిన్యూ ఇన్సపెక్టర్  రేణుక యంత్రాల వినియోగ విధానం  పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment