Sunday, 21 October 2018

పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా 3కే రన్



 కొమురంభీం ఆసిఫాబాద్  రెబ్బెన అక్టోబర్  21 : పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా పోలీసుల  ఆధ్వర్యంలో రెబ్బెన మండలం  గోలేటి లో 3కే  రన్ ఆదివారం  నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సర్కిల్ ఇన్సపెక్టర్  రమణ మూర్తి జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ,మాట్లాడుతూ పోలీసులు తమ విధినిర్వహణలో ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెడతారని అన్నారు.వారి సేవలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21 న అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు.  ఈ కార్యక్రమంలో ఎస్సై దీకొండ  రమేష్ , సిబ్బంది, మండలంలోని యువకులు  పాల్గొన్నారు. 

No comments:

Post a Comment