Friday, 5 October 2018

కొబ్బరికాయ కొట్టి భూమి పూజచేసిన సి సి రోడ్డు పనులు పక్కన పెట్టి ; ఊరు చివరన రోడ్డు

  కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; అక్టోబరు  5 ; జనావాసాలమధ్య కాకుండా  ఊరు చివరన సి సి  రోడ్డు  వేశారని   రెబ్బెన మండల కేంద్రములోని సబ్  స్టేషన్  ఇందిరా కాలనీ   వాసులు   అంటున్నారు. ఎం ఎల్ ఏ, ఎం ఎల్ సీ లు   కొబ్బరికాయ కొట్టి భూమి పూజచేసిన  సి సి  రోడ్డు  పనులు పక్కన పెట్టి  దేవుడు కరుణించినా పూజారి వరం ఇవ్వనట్లు సింగరేణి సంస్థ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ స్కీం కింద  ఇచ్చిన నిధులతో రెబ్బెన గ్రామంలో అంతర్గత రోడ్ ల పనులకు శ్రీకారం చుట్టడం జరిగింది.  ఎం ఎల్ ఏ  , ఎం ఎల్ సి లు సుమారు నాలుగు నెలలక్రితం రోడ్డు పనులకై శంఖుస్థాపన చేసి గుత్తేదారులకు పనులు అప్పగించినట్లు, కానీ గుత్తదారు కొంతమంది ఒత్తిడులకు లొంగి ప్రతిపాదిత చోట కాకుండా ఊరుచివర జనావాసాలు లేని ప్రాంతంలో  ఆ నిధులతో సి సి రోడ్డు  వేయటంజరిగిందన్నారు. తెరాస కార్యకర్తలే గుత్తేదారులుగా మారి అధికారుల అండదండలతో మండలం లో వేసిన రోడ్లు   నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఇష్టారాజ్యం గా వైబ్రేటర్ పెట్టకుండా, వేసిన రోడ్ కు వాటర్ క్యూరింగ్ చేయకుండా వదిలి వేయడంతో కొత్తగా వేసిన రోడ్ లన్ని పగుళ్లు తేలుతాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా సంబదిత అధికారులు నాణ్యతా పరమైన పరీక్షలు చేయకుండా   చెల్లింపులు చేస్తున్నట్లు  ఆరోపిస్తున్నారు.

No comments:

Post a Comment