Saturday, 27 October 2018

గంగాపూర్ అభివృద్ధిని అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదా

కొమురంభీం ఆసిఫాబాద్  రెబ్బెన అక్టోబర్ 27 ;  అభివృద్ధి నిధులు అందుబాటులో ఉన్న  గంగాపూర్ లో అభివృద్ధి జరగకుండా అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ నాయకులు  కాదా అని టిఆర్ఎస్ గంగాపూర్ పట్టణ అధ్యక్షుడు గుర్లె చంద్రయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులను సూటిగా  ప్రశ్నించారు. శనివారం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గంగాపూర్ పంచాయతీ అభివృద్ధికి నిధులను ఎం ఎల్ ఏ   కోవ లక్ష్మీ కృషితో  ప్రభుత్వం 20 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ మంజూరు చేస్తే గ్రామ సర్పంచ్ ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు తీర్మానాలు ఇవ్వకుండా అభివృద్ధిని అడ్డుకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు.తీర్మానాలు చేయకపోవడంతో  నిధులు ఖర్చు కాకుండా వెనక్కి మల్లి పోయాయన్నారు.24 లక్షల డి ఎం ఎస్ నిధులతో సిసి రోడ్లు నిర్మించేందుకు టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కృషి చేస్తే గంగాపూర్ లో అభివృద్ధి జరిగితే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు దక్కని అక్కసుతో కలెక్టర్ను కలిసి పనులు జరగకుండా కుట్ర పన్నారన్నారు.  మూడో దఫా అభివృద్ధి పనుల్లో భాగంగా గంగాపూర్ రోడ్డు మరమ్మత్తులకు ప్రతిపాదన సిద్ధం చేసిన ఘనత టి.ఆర్.ఎస్ దన్నారు. టిఆర్ఎస్ పార్టీ తోనే  గంగాపూర్ లోని అన్ని వాడలలో అభివృద్ధి పనులు జరుగుతాయి తప్ప కాంగ్రెస్ పార్టీతో జరిగే అభివృద్ధి ఏమిలేదన్నారు. ముందస్తు ఎన్నికల్లో భాగంగా 2 రోజుల క్రితం టిఆర్ఎస్ పార్టీ చేపట్టిన ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి కోవా లక్ష్మీ కి ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. . రాబోయే ఎన్నికల్లో కోవా లక్ష్మీ నీ గంగాపూర్ ప్రజలు అధిక మెజారిటీ తో. గెలిపించుకుంటామని అన్నారన్నారు.  టీఆర్ఎస్ పై అసత్య ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజలు తమ ఓటు హక్కుతో గుణపాఠం చెప్పాలన్నారు. ఈ సమావేశంలో తెరాస నాయకులూ మధునయ్య, దుర్గం శ్రీనివాస్, ఆనందరావు, విలాస్, మనోహర్, జయరాం, తదితరులు ఉన్నారు. 

No comments:

Post a Comment