రెబ్బెన ; రెబ్బెన మండలం పులికుంట గ్రామం అంగన్వాడీ పాఠశాలలో గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతం వేడుకను ఐసీడీఎస్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌతమి మండల సమాఖ్య బి లక్ష్మి మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం తీసుకోవాలని, పండు, ఆకుకూరలు తీసుకోవాలని అన్నారు. మన సంప్రదాయాన్ని అనుసరించి గర్భిణులకు శ్రీమంతం జరపడం ఆనవాయితీ అని ఈ వేడుక జరపడం ద్వారా గర్భిణులకు పండంటి బిడ్డ పుట్టాలని ముత్తైదువులు దీవిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో పులికుంట గ్రామానికి చెందిన ఈ తిరుపతమ్మ, ఈ మమత లకు పలువురు ముత్తైదువులు స్వీట్లు తినిపించి దీవించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఉపాధ్యాయులు ఈ స్వప్న, సహాయకురాలు బాయక్క,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment