Monday, 1 October 2018

ఉద్యోగుల పదవీ విరమణ సందర్బంగా సన్మానం

రెబ్బెన ;  సింగరేణి సంస్థలో విధులు నిర్వహిస్తూ ఉద్యోగులకు పదవీ విరమణ సహజమని కైరిగూడ ప్రాజెక్టు అధికారి మోహన్ రెడ్డి  అన్నారు.  బెల్లంపల్లి ఏరియాలోని కైరిగూడ ఓసిపిలో విధులు నిర్వహించిన కార్మికులు గుడ్ల లక్ష్మి నారాయణ , దుగ్యాల దుర్గయ్య పదవీ విరమణ సందర్భంగా  సోమవారం గని ఆవరణలో కార్మికులకు  సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి పూలమాలతో సత్కరించి మిఠాయిలు పంచుకున్నారు అనంతరం వారికి సీఎంపీఎఫ్ , పింఛన్  చెక్కులు అందించారు ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారి మాట్లాడుతూ ఉద్యోగులకు పదవి విరమణ ఉద్యోగంలో భాగమని అన్నారు వచ్చిన డబ్బుల్లో సక్రమంగా వినియోగించుకుని సుఖమైన జీవితం గడపాలని ఆకాంక్షించారు.  ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షులు మాల్రాజ్  శ్రీనివాస్ రావు, ఫిట్ కార్యదర్శి తాళ్ళపల్లి రాములు ,యాక్టింగ్ మేనేజర్ శంకర్ ,వెల్ఫేర్  అధికారి క్రాంతితో పాటు సూపర్వైజర్లు   కార్మికులు పాల్గొన్నారు

No comments:

Post a Comment