Saturday, 6 October 2018

అధికారుల నిర్లక్ష్యము తో నీరందక రైతులకు ఇబందులు

 కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; అక్టోబరు 6 ;  అధికారుల నిర్లక్ష్యం తో మండలములోని రైతులు వేసిన పంటలకు  నీరందక ఇబ్బందులు పడుతున్నారని ఎం పి టి సి శ్రీనివాస్  అన్నారు . శని వారం వట్టి వాగు కెనాల్ ను సందర్శించారు . అనంతరం మాట్లాడుతూ  వట్టి వాగు ప్రాజెక్టు క్రింద డి 9 , డి 10, డి 11, డి 2 కాలువల క్రింద పుంజుమ్మెరా గూడా, లేతన్ గూడా, రెబ్బెన , ఇందిరా నగర్ , సింగిల్ గూడా గ్రామాలరైతుల భూములు పరిశీలించామని ,  డి  5, డి 6,  ప్రధాన కాలువ షట్టర్లు తొలగించడం తో 20 రోజులు గా నీళ్లు రాక పోవడము తో చేతికి అందే పంట  అందకుండాపోతుందని అన్నారు. అధికారుల నిర్లక్ష ధోరణి తోనే రైతులు నష్ట పోయే ప్రమాద ముందని వారు అన్నారు . ఇప్పటి కైనా సంభందిత అధికారులు రైతుల పై దృష్టి సారించి పంటలకు నీరు అందేలా చూడాలని వారు తెలిపారు. వీరితోపాటు పి  ఏ  సి చైర్మన్ గాజుల రవీందర్, మాజీ సర్పంచ్ రవీందర్ వెంకటేష్ చారి, రైతులు మురళి, శ్రీనివాస్, రాజేష్, బాపన్న, తదితరులు ఉన్నారు.

No comments:

Post a Comment