కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన అక్టోబర్ 31 : అభివృద్ధి కోసం తెరాస ను మళ్ళీ గెలిపించాలని తాజా మాజ ఎం ఎల్ ఏ కోవలక్ష్మి అన్నారు. బుధవారం రెబ్బెన మండలం తక్కెళ్లపల్లి, రొల్లపాడు పులికుంట, పత పులికుంట, రోడ్ పులికుంట గ్రామాలలో గడపగడపకు వెళ్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ తక్కల్లపల్లి, రొల్లపాడు, గ్రామాలకు బీటీ రోడ్ శాంక్షన్ చేశామన్నారు. పనులు తొందరలోనే మొదలౌతాయన్నారు. తెలంగాణ ప్రజలకు ఇంతవరకు దేశంలో ఎవరు అమలు చేయని వివిధ సంక్షేమ పథకాలను ప్రకటించి అమలుచేస్తున్న ప్రభుత్వం ముఖ్య మంత్రి కెసిఆర్ నాయకత్వంలోని తెలంగాణా ప్రభుత్వమేనని అన్నారు. తెలంగాణ కోసం అహోరాత్రులు శ్రమించి సాధించుకున్న తెలంగాణాను బంగారు తెలంగాణా గా మార్చడానికి ముఖ్య మంత్రి కెసిఆర్ నిరంతరం శ్రమిస్తున్నారని అన్నారు. నాలుగు సంవత్సరాలలో టీఆర్ఎస్ ప్రభుత్వం గత పాలకులు చేయలేని అభివృద్ధిని చేసి చూపించిందన్నారు. రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరానికి రెండు పంటలకు 4 వేల చొప్పున 8 వేలు ఇచ్చామని అన్నారు. ఈ ఎన్నికలలోత్ర్సపార్టీ ని గెలిపించినట్లైతే ఈ సాయాన్ని 10 వేలకు పెంచుతామన్నారు. రైతు బీమాను దేశంలో మొదటి సారిగా రైతులకు పైసా ఖర్చు లేకుండా ప్రెవేశపెట్టామన్నారు. పేదలకు కంటి వెలుగుకార్యక్రమం కింద ఉచిత కంటి పరీక్షలు చేసి కంటి అద్దాలను కూడా ఇచ్చేకార్యక్రమాన్ని అమలు చేశామన్నారు. ప్రతి గ్రామానికి బి టి రోడ్ సౌకర్యం కలిగించామన్నారు. గతంలో కాంగ్రెసుప్రభుత్వహయాంలో ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి వేలకోట్లు నాయకులూ దండుకున్నారని అన్నారు, తెరాస ప్రభుత్వం పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లుకట్టించే పథకం అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర అభివృద్ధిని అనునిత్యం అడ్డు పడటానికి, పదవి కాంక్షతో, మహాకూటమిని ఏర్పాటు చేసుకొని టిడిపితో కాంగ్రెస్, తెలంగాణ జన సమితి, సిపిఐ పార్టీలు పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని, ప్రజలు గమనించి ఎన్నికల్లో మహాకూటమికి తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. సంక్షేమ పథకాలు ఇక ముందు అమలు కావడానికి టీఆర్ఎస్ పార్టీని మరోసారి ఆదరించి గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమానికి మండలం నుంచి కార్యకర్తలు, నాయకులూ పెద్దఎత్తున తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు, జడ్పీటీసీ బాబు రావు, ఎంపీపీ సంజీవ్ కుమార్, జడ్పీటీసీ బాబురావు, ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు కుందారపు శంకరమ్మ, మండలాధ్యక్షుడు పోటు శ్రీధర్ రెడ్డి, మాజీ సర్పంచ్లు , గజ్జెల సుశీల, చిన్నయ్య, ఉద్యమకారులు నవీన్ జైస్వాల్, చిరంజీవి, సోమశేఖర్, సుదర్శన్ గౌడ్, మన్యం పద్మ, అన్నపూర్ణ అరుణ, బొమ్మినేని శ్రీధర్, మాణిక్య రావు, , సంగం శ్రీనివాస్, తదితర నాయకులు ఉన్నారు.
No comments:
Post a Comment