కొమురంభీం ఆసిఫాబాద్ (రెబ్బెన) అక్టోబర్ 14 : తెరాస ప్రభుత్వం ప్రెవేశ పెట్టిన సంక్షేమ పధకాలు ప్రజలు గమనించి మహాకూటమికి తగిన గుణపాఠం చెప్పి ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్, ఎం ఎల్ ఏ అభ్యర్థి కోవా లక్ష్మి లు అన్నారు. ఆదివారం తెరాస పార్టీ ప్రచారంలో భాగంగా రెబ్బెన మండలం వంకులం, నంబాల గ్రామాలలో పర్యటించి, అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణా ప్రతిష్టను పెంచిన కెసిఆర్ ను ఓడించాలనే ధేయంతో తమ తమ సిద్ధాంతాలు మరచి పచ్చకండువా చంద్రబాబుతో పొత్తు పెట్టులాకొన్న కాంగ్రెస్ పార్టీ ని కాంగ్రెస్ పాలిట రాష్ట్రాలలో రైతు బంధు, రైతు భిమానా పథకాలను ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నించాలన్నారు. ఎంతో కస్టపడి సాధించుకొన్న తెలంగాణాను మళ్ళి ఆంధ్రాలో కలిపేందుకు మహాకూటమి పేరుతొ ప్రజలను మోసగిస్తున్నారన్నారు. ప్రజలు గమనించి ఎన్నికల్లో మహాకూటమికి తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. తెలంగాణ కోసం అహోరాత్రులు శ్రమించి సాధించుకున్న తెలంగాణాను బంగారు తెలంగాణా గా మార్చడానికి ముఖ్య మంత్రి కెసిఆర్ నిరంతరం శ్రమిస్తున్నారని అన్నారు. నాలుగు సంవత్సరాలలో టీఆర్ఎస్ ప్రభుత్వం గత పాలకులు చేయలేని అభివృద్ధిని చేసి చూపించిందన్నారు రాష్ట్ర అభివృద్ధిని అనునిత్యం అడ్డు పడటానికి, పదవి కాంక్షతో, మహాకూటమిని ఏర్పాటు చేసుకొని టిడిపితో కాంగ్రెస్, తెలంగాణ జన సమితి, సిపిఐ పార్టీలు పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని అన్నారు. సంక్షేమ పథకాలు ఇక ముందు అమలు కావడానికి రాబోయే ఎన్నికలలో ఎం ఎల్ ఏ అభ్యర్థి కోవలక్ష్మి కి ఓటేసి టీఆర్ఎస్ పార్టీని మరోసారి ఆదరించి గెలిపించాలన్నారు. తెరాస పార్టీలో చేరిన పలువురు నాయకులకు పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంజీవ్ కుమార్, జడ్పీటీసీ బాబురావు, ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు కుందారపు శంకరమ్మ, మండలాధ్యక్షుడు పోటు శ్రీధర్ రెడ్డి, రైతు అధ్యక్షులు నాగయ్య, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు, నవీన్ జైస్వాల్, చిరంజీవి, సోమశేఖర్, గజ్జెల సత్య నారాయణ, వసంత రావు, వినోద్ జైస్వాల్, తదితర నాయకులు ఉన్నారు.
No comments:
Post a Comment