Tuesday, 9 October 2018

కాంగ్రెస్ పార్టీ సమావేశాన్నినాయకులు విజయవంతం చేయాలి

కొమురంభీం ఆసిఫాబాద్  అక్టోబర్ రెబ్బెన 09 : రాబోయే ఎన్నికల దృష్ట్యా  పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై బుధవారం రెబ్బెన మండలం గోలేటి టౌన్ షిప్ లో నిర్వహించబోయే కాంగ్రెస్ పార్టీ సమావేశాన్ని పార్టీ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని  విజయవంతం చేయాలని పార్టీ మండల అధ్యక్షుడు ముంజం రవీందర్,  నంబాల ఎంపిటిసి కొవ్వూరు శ్రీనివాసులు కోరారు మంగళవారం రెబ్బెనలో  ఏర్పాటుచేసిన   విలేకర్ల సమావేశంలో మాట్లాడారు సమావేశానికి మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్రావు ,ఐఎన్టియుసి ప్రధాన కార్యదర్శి జనక్ ప్రసాద్, డిసిసి ప్రధాన కార్యదర్శి విశ్వప్రసాద్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు హాజరుకానున్నట్లు తెలిపారు రాబోయే ఎన్నికల్లో పార్టీ  కార్యాచరణ రూపు   గురించి మాట్లాడనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో బానయ్య, పల్లాస్, రవీందర్, వామన్ తదతరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment