Tuesday, 29 November 2016

ఆసుపత్రి సదుపాయాల కొరకు సమీక్ష

ఆసుపత్రి సదుపాయాల కొరకు సమీక్ష 
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలంలో ఆసుపత్రి సదుపాయాల కొరకు మంగళవారం ప్రజాప్రతినిధులు ఆసుపత్రి సిబ్బంది సమావేశం ఏర్పడి మౌళిక సదుపాయాల కొరకు చర్చించారు . ఈ సందర్బంగా  డాక్టర్ సంతోష్ సింగ్ మాట్లాడుతు ఆసుపత్రిలో సదుపాయాల కోసం నిధులు 1 లక్షా 7500 వేలు ఉన్నాయి మరింత సదపాయాల కోసం 3 లక్షల వేయం అవసరం ఉందని అందుచే ఆయన సొంత జీతభత్యాలతో 50వేల రూపాయలు అభివృద్ధి కొరకు ఇచ్చారు. ఎంపిపి  సంజీవ్ కుమార్ మాట్లాడుతు ఆసుపత్రిలో మౌళిక సదుపాయాల కోసం మా నిధుల నుంచి అలాగే ప్రజా ప్రతినిధులు కలసి 1లక్షా 50వేలు సేకరించి వైద్య సదుపాయాన్ని మరింతగా పెంచి మండల ప్రజలకు ఉపయోగ పడేల ఆసుపత్రిని తీర్చిదిద్దుదాం అన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి బాబురావు, ఎంపిడిఓ సత్యనారాయణ సింగ్, మార్కెట్ వైస్ చేర్మెన్ కుందారపు శంకరమ్మ,  వైస్ ఎంపిపి రేణుక, సర్పంచ్ పెసర వెంకటమ్మ, మండల్ సర్పంచులు ,ఎంపిటిసిలు, తదితరులు పాల్గొన్నారు.

1 comment: