.పత్తి కొనుగోలు కేంద్రం పార్రంభం
కొమురం బీమ్ జిల్లా ఆసిఫాబాద్ , ( వుదయం ప్రతినిధి): ఆసిఫాబాద్ మార్కెట్ యాడ్ లో పత్తి కొనుగోలు కేంద్రాలను శనివారం ఉప పాలనాధికారి అశోక్ కుమార్ మార్కెట్ అధ్యక్షలు గంథం శ్రీనివాస్ మరియు ఉపాధ్యాక్షులు కుందారపు శంకరమ్మలు ప్రారంభించారు. వారు మాట్లాడుతూ రైతులు కు గిట్టు బాటు ధరలతో పాటు మోసపూరిత కొనుగోలులు లేకుండా ఉండడానికి ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. మార్కెట్ కమిటీ పరిధిలో కెరమెరి, రెబ్బెన, తిర్యాణి,వాంకిడి మండలాలు ఉన్నాయని ఎలాంటి అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. యార్డులో పశువుల కోసం ప్రత్యేకంగా నీటి తొట్టెలు మరియు మరుగుదొడ్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మొత్తం ఐదు తూకం కాంటాలు ఉన్నాయి. అందులో నాలుగు ఎడ్ల బండ్ల కాంటలు, ఒకటి లారీ కాంట ఉంది. ప్రస్తుతం లారీ కాంటలు ఉన్నాయి. ఆసిఫాబాద్ మార్కెట్ యార్డులో అగ్నిమాపక పరికరాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. 60 వే ల లీటర్ల సామర్థ్యం గల నీటి ట్యాంకు, అంతే సా మర్థ్యం గల ఇన్‌టెక్ వెల్ ఉంది. జనరేటర్ సౌక ర్యం ఉంది. దీంతో మార్కెట్ ఆవరణంతా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వ్యాపారులు కొనుగొలు చేసిన పత్తిని నిల్వ ఉంచేందుకు మూడు ఓపెన్ షెడ్లు, మూడు కవర్ షెడ్లు ఉన్నాయి. పూర్తి స్థాయిలో రైతులుకు అనుకూలముగా ఎర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ పల్లె రాజేశ్వర్ , ఉత్తమ్ నాయక్ , గడ్డం వెంకన్న , రాహాన్ సర్పంచ్ సరస్వతి , ఎం పి ఫై వెంకన్న , కార్య దర్శి కోట విజయ్ కుమార్ , రైతులు, అధికారులు తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment