Monday, 28 November 2016

గ్రామాల అభివృద్ధి కి నిధులు కేటాయించండి

గ్రామాల అభివృద్ధి కి నిధులు కేటాయించండి

కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బన మండల సర్వసభ్యసమావేశం సోమవారంనాడు ఎంపిపి కార్నాథం సంజీవకుమార్ అధ్యక్షతన  జరిగింది. ఈ సమావేశం లో పలువురు ప్రజాప్రతినిధులు సమస్యల ఫై అధికారులను ప్రశ్నించారు.  సభ్యులు మాట్లాడుతూ సమయానికి నిధులు రాక గ్రామాల అభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు.అలాగే రెబ్బెన ప్రభుత్వ హాస్పిటల్ లో అధనంగా మరో డాక్టర్ ను ,నియమించాలని కోరారు.ఉపాధి హామీ పధకం  చెల్లింపులో జాప్యం జరుగుతుందని,ఇంకుడుగుంతలు నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లులు రాక  ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.బిసి, మైనారిటీ కమ్యూనిటీ భవనాలకు నిధులు, భూస్థలాలు కేటాయించాలని అన్నారు నేర్పాల్లి లో గత వేసవి లో నీళ్లు సప్లై చేసిన వారికీ బిల్లులు చెల్లించాలని అడిగారు..మండలంలో కొంతమంది ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదని వారి ఫై చర్యలు తీసుకోవాలని,ఉపాధ్యాయులు సమయపాలన పాటించే విదంగా చర్యలు చేపట్టాలని కోరారు.అధికారులు ఎవరు అందుబాటు లో ఉండడం లేదని, అందరూ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉండాలని అన్నారు.  అజడ్పీటీసీ ఆజ్మేర.బాబురావు మాట్లాడుతూ అక్రమ ఇసుక రవాణా ను అరికట్టాలని అన్నారు.వచ్చే సీజన్లో లో టేకు మొక్కలు నాటేందుకు గాను సిదంగా ఉన్నాయని అధికారి అన్నారు.ఈ సమావేశం లో తహసీల్ధార్ బండారి రమేష్ గౌడ్,ఎంపీడీఓ సత్యనారాయణసింగ్  ,ఈఓ.పిఆర్డి.కిరణ్,ఏపీఎం లు వెంకటరమణ,రాజ్ కుమార్,సీడీపీఓ మమత, ఆర్ డబ్ల్యు ఎస్ జెఇ , పిఆర్.జెఇ.  ,  ఎంపీటీసీసభ్యులు కొవ్వూరి.శ్రీనివాస్, మద్దెల.సురేందర్, సర్పంచ్ లు పెసారు వెంకటమ్మ,గజ్ఝేల సుశీల,భీమేష్,తోట లక్ష్మణ్,రావోతుల పద్మ,రవీందర్ మండల అధికారులు,ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment