Friday, 18 November 2016

విద్యార్థులకు మాక్ పోలింగ్ గురించి అవగహన

విద్యార్థులకు మాక్ పోలింగ్ గురించి అవగహన 

కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బెన లోని జిల్లా ప్రజా పరిషత్  పాఠశాలలో శుక్ర వారం  విద్యార్థులకు ప్రజాస్వామ్య పద్ధతిలో మాక్‌ ఎన్నికలు  హెడ్ మాస్టర్ స్వర్ణలత అద్వర్యం లో మాక్ పోలింగ్ నిర్వహించారు. ఎంపీపీ సంజీవ్ కుమార్ ముఖ్య అతిధిగా హాజరై పోలింగ్ కేంద్రాన్ని ప్రారంభించారు.  భారత ఎన్నికల సంఘం అమలు చేస్తున్న ఎన్నికల ప్రక్రియను విద్యార్థులకు వివరిస్తూ బ్యాలెట్‌ పేపర్‌తో ఎన్నికలు చేపట్టారు. ఈ మేరకు ఎన్నికల నోటిఫికేషన్‌ దరఖాస్తుల స్వీకరణ, ఉపసంహరణ, స్క్రుటిని, పోటీ చేసే అభ్యర్థుల ప్రచారం, ఓటింగ్‌ ప్రక్రియపై విద్యార్థులకు అవగాహన కల్పించిన అనంతరం అభ్యర్థుల గుర్తులతో కూడిన బ్యాలెట్‌, చూపుడు వేలుకు సిరా అంటించడం, నచ్చిన అభ్యర్థికి ఓటు వేసి బ్యాలెట్‌ బాక్సుల్లో వేసే ప్రక్రియను నిర్వహించి విజేతలను ప్రకటించారు. ఈ సందర్బంగా ఎంపీపీ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు చిన్ననాటి నుంచే ప్రజస్వామ్య పద్దతిలో ఓటు పోలింగ్ అవగాహన ఎంతో అవసరమని రానున్న రోజుల్లో ఓటు వేయడానికి ఎంతో దోహత పడుతుందని అన్నారు.   ఈకార్యక్రమంలో సర్పంచ్ పెసర వెంకటమ్మ ,ఉపసర్పంచ్ బొంబినేని శ్రీధర్ కుమార్ , వార్డ్  సభ్యులు మడ్డి శ్రీనివాస్ ,కమిటీ సభ్యులు భేమేష్ ఉపాధ్యాయులు ,విద్యార్థులు , తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment