కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) జిల్లాల పునర్విభజన లో భాగంగా మంచిర్యాలలో జరిగిన ఏఐటీయూసీ జిల్లా నిర్మాణ మహాసభలలో కొమురంభీం జిల్లా కమిట ఎన్నుకోవడం జరిగిందని జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన ఎస్.తిరుపతి తెలిపారు.జిల్లా అధ్యక్షుడిగా ఎస్.తిరుపతి, ఉపాధ్యక్షుడిగా బయ్యా మొగిలి, ప్రధాన కార్యదర్శిగ కాగజ్ నగర్ కు చెందిన అంబాలా ఓదెలు,సహాయ కార్యదర్శి గ బోగే ఉపేందర్, కోశాధికారిగా రాయిల్ల నర్సయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్బంగా ఎన్నికైన వారు మాట్లాడుతూ అసంఘటిత కార్మిక వర్గం సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తామ, కాంట్రాక్టు కార్మికుల పై ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని,సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న కార్మిక వర్గంఫై ప్రభుత్వం కేసులు పెడుతుందని వారు అన్నారు.జిల్లాలో ఏఐటీయూసీ ని బలోపేతం చేస్తామని,అన్ని మండలలో ఏఐటీయూసీ కమిటీ లు ఏర్పాటు చేస్తామని అన్నారు.
No comments:
Post a Comment