Saturday, 19 November 2016

ఘనముగా ముగిసిన 49 వ గ్రంధాలయ వారోత్సవాలు

ఘనముగా ముగిసిన 49 వ గ్రంధాలయ వారోత్సవాలు 



కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) 49 వ వారోత్సవాలను పురస్కరించుకుని రెబ్బెన  శాఖా గ్రంథాలయంలో శనివారం  విద్యార్థులకు ఆయా పోటీలు నిర్వహించారు. వారోత్సవాలన చివరిరోజున లైబ్రేరియన్‌ పాలకుర్తి స్వర్ణలత గౌడ్   ప్రభుత్వ, ప్రయివేట్‌ పాఠశాలల విద్యార్థులకు వ్యాస రచన, ఉపన్యాస, చిత్రలేఖన పోటీలను జరిపారు. గెలుపొందిన విద్యార్హులకు  బహుమతులను అందజేశారు. రెబ్బెన  :గ్రంథాలయంలో పఠనం చేసుకొని గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని ముఖ్య అతిథి గ విచ్చేసిన ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ మాట్లాడారు  నిత్యం పుస్తకాలను,పత్రికలను  చదు వుతూ ఉంటే కొత్త కొత్త విషయాలు తెలుస్తాయని తెలిపారు ముఖ్యముగా యువతకు ఉద్యోగాలు అవకాశాలతో పాటు పుస్తకాల పఠానం వల్ల మేధ శక్తి ని పెపొందించుకోవచ్చు అని అన్నారు గ్రంథాలయాల్లో ప్రముఖుల  శాస్త్రవేత్తల జీవిత చరిత్రలు పుస్తకాలు దొరుకుతాయి అవి చదివి మహాను బావుల ఆదర్శముగా తీసుకోని ముందుకుసాగాలి అని తెలియచేశారు  ఈ సంధర్భంగా వారం రోజుల పాటు నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొని ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో తెరాస నాయకులూ అన్నపూర్ణ .శాంతికుమార్ గౌడ్ , ప్రభాకర్, ఉపాద్యులు  శ్రీనివాస్ ఖాదర్, సత్యం, అమీర్ ఉస్మాని, సోమశేఖర్ ,గ్రామప్రజలు విద్యార్థులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment