తెలుగు దేశం పార్టీని బలోపెతం చేద్దాం -- రాథోడ్ రమేష్
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) తెలంగాణలో టిడిపి కి మంచి గుర్తింపు ఉందని , తెలుగు దేశం పార్టీని బలోపితం సభ్యత్వ క్రమాన్ని చేపట్టినట్లు టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు , మాజీ ఎం పి రాథోడ్ రమెష్ అన్నారు . తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆదివారం రాష్ట్ర పొలిటిబ్యూరో సభ్యులు రాథోడ్ రమేష్ మరియు జిల్లా అధ్యక్షులు అబ్దుల్ కలం మహిళా జిల్లా అధ్యక్షురాలు సొల్లు లక్ష్మి లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీని అంటిపెట్టుకుని ఉండేది కార్యకర్తలేనని అన్నారు. కొంత మంది నాయకులు అధికారం కోసం వస్తారని, పార్టీ సిద్ధాంతం కోసం పని చేసే వారు కార్యకర్తలన్నారు. ఎప్పుడైనా నాయకులు పార్టీని వీడతారని, కార్యకర్తలు కాదని అన్నారు. అటువంటి వారికి పార్టీ తరపున భరోసా ఇవ్వడానికి బీమా సౌకర్యాన్ని కల్పించేం ఏర్పాటు చేసారన్నారు. తెరాస ప్రభుత్వం కళ్ళబుల్లి మాటలతో కాలయాపన చేస్తూ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని అన్నారు అధికారంలో ఉన్న నాయకుల కనుసైగలతో లంచ గోండి ప్రభుత్వంలా మారిందన్నారు రానున్న రోజుల్లో టిడిపి పార్టీదే పై చెయ్యి ఉంటుందన్నారు . క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారికి డిసెంబరు 15వ తేదీ కల్లా సభ్యత్వ కార్డులు, జనవరి నాటికి బీమా పత్రాలు అందజేయబడతాయన్నారు . ఈ కార్య క్రమములో మండల అధ్యక్షులు సంగం శ్రీనివాస్ , ప్రధాన కార్య దర్శి అజయ్ జైస్వాల్ , నాయకులు పోతిరెడ్డి , అజమేరా రమేష్ , ప్రేమ్ దాస్ , రామ్ కుమార్ , రావుజీ తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment