Saturday, 26 November 2016

షరతులు లేని వారసత్వ ఉద్యోగాలు కల్పించాలి

షరతులు లేని వారసత్వ ఉద్యోగాలు కల్పించాలి 

కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి)   ముఖ్య మంత్రి కే సి ఆర్ ఎన్నికల సమయం లో కార్మికులకు ఇచ్చిన హామీల ప్రకారం ఎలాంటి షరతులు లేకుండా అందరికి వారసత్వ ఉద్యోగాలు  కల్పించాలని కార్మికుల బిడ్డల  సంఘం నాయకులు ఫర్వేజ్,రవీందర్ ,తిరుపతులు అన్నారు .రెబ్బెన మండలంలోని గోలేటి బస్సు ప్రాంగణం లో శనివారం నాడు  మంచిర్యాలలో జరిగే సింగరేణి కార్మికవారసుల సమావేశానికి సంభందించిన గోడప్రతులు విడుదల చేసారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నిక ల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఒక్క సంవత్సరం సర్వీస్ నిబంధన వలన రెండువేల ఆరువందల కార్మిక కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని,తెలంగాణ  ఉద్యమ సమయం లో  సకల జనుల సమ్మె లో  ప్రతిఒక్క కార్మికులు పాల్గొన్నప్పటికీ ఈ షరతులు ఎందుకన్నారు . మంచిర్యాలలో జరిగే కార్మికుల వారసుల భహిరంగ సభకు  కార్మికులు వారి పిల్లలు మరియు ప్రజా ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరై విజయ వంతం చేయాలనీ కోరారు ఈ సమావేశమం లో రంజిత్ , అశోక్ ,తిరుపతి , సమీర్, సతిష్ ,తదితరులు పాల్గొన్నారు . 

No comments:

Post a Comment