టి బి జి ఎస్ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో పలు సంఘాల కార్మికుల చేరిక
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) బెల్లంపల్లి ఏరియా లోని వివిధ గనులపై టి బి జి కే ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్షి మిర్యాల రాజిరెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. కైరుగూడ ,గోలేటి 1 వర్కుషాప్ వద్ద నున్న కార్మికులతో ద్వారసమాచారాలంలో ప్రసంగించారు . మరియు పలు యూనియన్ లకు సంభందించిన కార్మికులను టి బి జి కే ఎస్ కండువాలు కప్పి కార్మికులను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ సకలజనులసమ్మె కాలంలో సింగరేణి కార్మికులు పూర్తి సమ్మతి తెలిపారని. 18 సం" క్రితం పలు యూనియన్లు పోగొట్టిన వారసత్వ ఉద్యోగాలను బోర్డు మిటింగులో సంపాదించినా ఘనత రాష్త్ర ముఖ్యమంత్రిగారికే చెందుతుందని అన్నారు . మరియు కొన్ని ప్రతిపక్ష కార్మిక యూనియన్లు కావాలనే వి ఆర్ ఎస్ , డిస్స్మిస్ , షరతులతో కూడుకున్న వారసత్వ ఉద్యోగాల పై ప్రాపగాండా చేసినప్పటికీ నష్టపోయిన కార్మికుల 2600 మందికి పూర్తి న్యాయం చేసేందుకు ప్రయత్నించామని,కానీ చట్ట పరమైన కొన్ని నిభందనలు వారికీ వర్తించలేదని అన్నారు . ఈ సాందర్బంగా150 మంది కార్మికులు , ఫిట్ కార్యదర్శులు వివిధ యూనియన్ల నుండి టి బి జి కె ఎస్ లో కలిశారు . రామ్మూర్తి , నూనెకొమురయ్య వొడ్డెపల్లి ఓదెలు రవీందర్ ఎం. శ్రీనివాసరావు భైరి శంకర్ రాంరెడ్డి యాదగిరి సంపత్ మరియు తదితరులు పాల్గున్నారు.
No comments:
Post a Comment