తహసీల్దార్ కార్యాలయంను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా రెవిన్యూ అధికారి
కొమురం బీమ్ (వుదయం ప్రతినిధి): రెబ్బెన తహసీల్దార్ కార్యాలయం లో కొమురం భీం జిల్లా రెవిన్యూ అధికారి అద్వేత్ కుమార్ సింగ్ మంగళ వారం తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు పరిశిలించి , రైతుల సమస్యలు మరియు ఇతర సమస్యల గురించి మరియు కార్యాలయం లో జరుగుతున్న ఇతరత్ర పనుల అధికారుల వివరాలు గురించి అడిగి తెల్సుకున్నారు. మండలం లోని ప్రజా ప్రయోజనాలను సక్రమంగా నిర్వహించాలని విద్యార్థుల సర్టిఫికెట్స్ సకాలంలో అందించాలని అన్నారు . నూతనంగా ఏర్పడిన కొమురం బీమ్ జిల్లాలోని అధికారులక కార్యాలయ గృహాలకు సంబందించిన స్థలపరిశీలన భూ భాగాన్ని ప్రస్తావించారు. ఆయనతో పటు తహసీల్ధార్ రమేష్ గౌడ్ రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.
No comments:
Post a Comment