రెబ్బెనలో ఘనంగా బాలల దినోత్సవం
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలములో బాలల దినోత్సవాన్ని ప్రైవేట్ , ప్రభుత్వ పాఠశాలలలో సోమవారం ఘనంగా నిర్వహించారు . ఈ సందర్బంగా ఎస్ వి ఇంగ్లిష్ మీడియం పాఠశాల కరెస్పాండెంట్ ఢీకొండ విజయ కుమారి , విశ్వశాంతి హెడ్మాస్టర్ పోచయ్య లు నెహ్రు చిత్ర పటానికి పూల మాలలు వేశారు . అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంచారు . కరెస్పాండెంట్ విజయ కుమారి మాట్లాడుతూ పిలాలంటే నెహ్రు కు ఎంతో ఇస్తామని , చాచా నెహ్రు జన్మ దినాన్ని పిల్లలతో జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు . ప్రధాన మంత్రిగా దేశానికి ఎన్నో సేవలు చేశారు . నెహ్రు జీవిత చరిత్రను విద్యార్థులకు వివరించారు . ఈ కార్య క్రమములో ఎస్ వి ఇంగ్లిష్ మీడియం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఢీకొండ సంజీవ్ కుమార్ , ఉపాధ్యాయులు తిరుపతి , సుజాత విద్యార్థులు ఉన్నారు.
No comments:
Post a Comment