Tuesday, 1 November 2016

విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలని పాలనాధికారికి వినతి

  విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలని పాలనాధికారికి వినతి 

కొమురం బీమ్ (వుదయం ప్రతినిధి):  రెబ్బెన మండల్ లోని పలు ప్రభుత్వ విద్య సంస్థల్లో విద్యుత్ సౌకర్యాలు లేక మరికొన్ని పాఠశాలల్లో ప్రహరీలు లేమితో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు . ఇట్టి విషయం  పై ఏబీవీపీ మండల కన్వీనర్ అరుణకుమార్ జిల్లా కలెక్టర్ చంపాలాల్ కు  పలు సమస్యలతో కూడుకున్న వినతి పత్రం ను అందజేశారు . అనంతరం ఈ విషయమై మాట్లాడుతూ ఇందిరానగర్ వద్ద నూతనంగా నిర్మించిన జూనియర్ కళాశాల నెలలు గడుస్తున్నా బోధనకరువై సౌకర్యాలలేమితో కొట్టుమిట్టాడుతోందని అన్నారు . అలాగే గంగాపూర్ లోని కస్తూర్భా పాఠశాలకు ఏళ్ళు గడుస్తున్నా చుట్టూ ప్రహరీ లేక విద్యార్థినిలు బిక్కు బిక్కు మంటూ కలం వెళ్లదీస్తున్నారని విద్యార్థి నాయకుడు అన్నారు మరియు ఈ సమస్యలకు సంబందించిన అధికారులు వెంటనే స్పందించాలని కోరారు .

No comments:

Post a Comment