Monday, 7 November 2016

వారసత్వ ఉద్యోగాలను సాధించిన ఘనత టి బి జి కె ఎస్ దే ; మిర్యాల రాజిరెడ్డి

వారసత్వ ఉద్యోగాలను సాధించిన ఘనత  టి బి జి కె ఎస్ దే ; మిర్యాల రాజిరెడ్డి 
టి బి జి కె ఎస్ లో కార్మికుల  చేరిక...... 
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి)  వారసత్వ ఉద్యోగాలను సాధించిన ఘనత  టి బి జి కె ఎస్ దేననని  ఆ సంఘం ఉపాధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి అన్నారు. సోమవారం నాడు డోర్లి- 1 ఓపెన్ కాస్ట్  గని మీద టి బి జి కె ఎస్ అద్వర్యం లో నిర్వహించిన ద్వారా సమావేశాని  కి ముఖ్య అతిధి గ పాల్గొని ఆయన మాట్లాడుతూ  టి  బి  జి కె  ఎస్  తోనే  కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. దీనికి ఉదాహరణ వారసత్వాలను సాధించడం అని అన్నారు. అందరు కార్మికులు  టి బి జి కె ఎస్ ను ఆదరించాలని అన్నారు. అనంతరం పలు కార్మిక  సంఘల నుండి కార్మికులు టి బి జి కే ఎస్ చేరారు వారికి ఆయన కండువా కప్పి ఆహ్వానియించారు. ఐ ఎన్ టి యూ సి,హెచ్ ఎం ఎస్  నుండి  గని లో పని చేస్తున్న కార్మికులు నాగేందర్, డి వి ఆర్ చర్య, కొండు శంకర్, నర్సింగ రావు , దశరథం, చక్రపాణి, బాను సతీష్, తదితరులు చేరడం జరిగింది వీరందరికి మిర్యాల రాజిరెడ్డి కందువ కప్పి ఆహ్వానించారు.ఈ కార్యక్రమం లో ఏరియా ఉపాధ్యక్షుడు నల్గొండ సదాశివ్, నాయకులు మల్రాజ్ శ్రీనివాస్,రాజన్న, మొగిలి, కుమారసామి, మల్లేష్, ఉస్మాన్, రాంరెడ్డి, పాల్గొన్నారు.

No comments:

Post a Comment