Thursday, 17 November 2016

ఎస్ వి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో స్వయం పరిపాలన దినోత్సవం

ఎస్ వి ఇంగ్లీష్ మీడియం హై  స్కూల్ లో స్వయం పరిపాలన దినోత్సవం 


కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి)  రెబ్బెన లోని ఎస్ వి ఇంగ్లిష్ మీడియం హై  స్కూల్ లో  స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా  గురువారం నాడు నిర్వహించారు. విద్యార్థులే ఉపాధ్యాయులుగా విద్యా బోధన చేశారు . ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథిగా రెబ్బెన ఉన్నత పాఠశాల ప్రధానోపాస్యాయురాలు స్వర్ణలత పాల్గొని మాట్లాడారు . విద్యార్థులు చిన్న ప్పటినుండి క్రమశిక్షతో కూడిన విద్యను నేర్చుకోవాలని అన్నారు . ఉపాధ్యాయులు  విద్యార్థులను అన్ని రంగాలలో తీర్చి దిద్దాలన్నారు . విద్యార్థులకు క్రీడలు కూడా ఎంతో  ముఖ్యమని తెలిపారు . స్వయం పరిపాలన దినోత్సవంలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందజేశారు . ఈ కార్యక్రమములో రెబ్బెన ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ , ఉన్నత పాఠాశాలఉపాద్యాయులు సీమ , విజయ లక్ష్మి , పాఠశాల కరస్పాండెంట్ దీకొండ  విజయ కుమారి , పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దీకొండ  సంజీవ్ కుమార్ ,   టి ఆర్ ఎస్ నాయకులు సచిన్ ఉపాధ్యాయులు , విద్యార్థులు ఉన్నారు .

No comments:

Post a Comment