కాంట్రాక్టు కార్మికుల టోకెన్ సమ్మె
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) సింగరేణి లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం నాడు 48 గంటల టోకెన్ సమ్మె లో పాల్గొన్నారు. అన్ని కాంట్రాక్టు సంఘల పిలుపు మేరకు వారు సమ్మె చేపట్టడం జరిగింది.ఈ సంధర్బంగ అందరు కార్మికులు విధులను బహిష్కరించి వారి నిరసనను తెలియజేశారు. ఏ ఒక్క కాంట్రాక్టు కార్మికుడు విధులకు హజరు కాకుండా గోలేటి నాలుగు స్టంబాలు ఆర్చి వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగ పలువురు కార్మికులు మాట్లాడుతు చాల కాలం నుండి తక్కువ వేతనం కు పనిచేస్తన్నమని వేజ్ బోర్డు లో ఒప్పందం జరిగిన మొదటి క్యాటగిరి వేతనాన్నివెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం వస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి అనుకుంటే స్వరాష్ట్రం లో కూడా కార్మికులు అనేక ఇబ్బందులు ఎదురుకోవాల్సి వస్తుందని అన్నారు.కాంట్రాక్టు కార్మికులను పెర్మనెంట్ చేస్తా అని అన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కే సి ఆర్ ఎన్నికల సందర్బంగ ఇచ్చిన హామీ ని వెంటనే నెరవేర్చాలని అన్నారు. ఈ సమ్మె రెండు రోజులు కొనసాగుతుందని సమస్య పరిష్కారం కాకుంటే ఆందోళనలు ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ సమ్మె లో కాంట్రాక్టు కార్మికులు బోగే ఉపేందర్, బండారు తిరుపతి,చల్లూరి అశోక్,కిరణ్, అశోక్ గౌడ్,వెంకటేష్, రాజేష్,ఆశలు,రాయిలా నర్సయ్య,కాంట్రాక్టు మహిళా కార్మికులు,తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment