Tuesday, 22 November 2016

రెబ్బెనలో ఘనంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం

 రెబ్బెనలో ఘనంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం 

కొమురం బీమ్ (వుదయం ప్రతినిధి) ప్రపంచ మత్స్య కారుల దినోత్సవాన్ని పునస్కరించుకొని సోమావారం రెబ్బెనలోని అతిథి అవరంణంలో గ్రామా మత్స్యకారుల సంఘ అధ్యక్షడు పేసరి మధునయ్య ముదిరాజ్  అధ్యక్షతలో  ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నాలుగు జిల్లాల ప్రధాన కార్య దర్శి నీలం సంపత్ కుమార్ ముదిరాజ్ హాజరై మాట్లాడారు ముదిరాజ్ కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు అనంతరం మాట్లాడుతూ  డిసెంబర్ రెండు నుండి పద్దెనిమిది వరకు కొనసాగే మహాపాద యాత్ర ని ముదిరాజ్ భందువులంతా విజయవంతం చేయలని కోరారు .  ఈ మహా పాద యాత్ర ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు జరుగుతుంద్దన్నారు, బిసి డి  లోంచి బీసీ ఏ లోకి మార్చాలని డిమాండ్ చేసారు ప్రభుత్వం ఇకనైనా మదిరాజ్ లను గుర్తించి ప్రభుత్వ ప్రయోజనాలను అందేలా చూడాలని అన్నారు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు.  ఈ  కార్యక్రమంలో రెబ్బెన  సర్పంచ్ పెసర వెంకట్టమ్మ ముదిరాజ్ , కొమరంభీం జిల్లా ముదిరాజ్ కన్వీనర్ తోట లక్ష్మణ్ ముదిరాజ్ ,మంచిర్యాల జిల్లముదిరాజ్ సంఘ ప్రధాన కార్యదర్ద్షి పేట మల్లయ్య నాయకులు ,పేట మల్లయ్య ,మండలా అధ్యక్షులు శరత్ ముదిరాజ్,సంగం నాయకులు పోతురెడ్డి రమేష్ , తీగల శ్రీనివాస్ ,అంకం పాపయ్య ,మూడెడ్ల శ్రీనివాస్ ,అంకం సందీప్,మూడెడ్ల రమేష్ ,ఎర్రం మల్లేష్ ,మొగిలి ,శివకుమార్ ,రాజన్న ,వెంకటేశం, తదితరులు పాల్గొన్నరు.

No comments:

Post a Comment