కాంట్రాక్టు కార్మికుల ఐక్య సంఘల అద్వర్యం లో ద్వారా సమావేశం
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారాని కీ ఐక్య సంఘల అద్వర్యం లో అనునిత్యం పోరాడుతామని ఏఐటీయూసీ బ్రాంచ్ అద్యక్యుడు బోగే ఉపేందర్,ఇఫ్టూ అధ్యక్షుడు బండారి తిరుపతి అన్నారు. సోమావారం నాడు రెబ్బెన మండలం లోని గోలేటి సివిల్ ఆఫీస్ ముందు నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 11,12 తేది లలో 48 గంటల టోకెన్ సమ్మెను కాంట్రాక్ట్ కార్మికులు అధికసంఖ్యలొ పాల్గొని విజయవంతం చేయగలరని హెచ్ పి సి వేతనాల గురించి బోనసులు ఎన్ సి డబ్ల్యూ ఎ వర్తింపుల పై మరియు కాంట్రాక్ట్ కార్మికుల పర్మినేట్ చేయడం కొరకు పర్మింట్ కోటర్స్ తదితర సమస్సలపై సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జె ఏ సి చేపట్టే టోకెన్ సమ్మెను విజవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల కార్యదర్శి రాయిలా నర్సయ్య, బానోత్ కిషన్,సుధాకర్,ఐ ఎఫ్ టి యూ నాయకులు చంద్రయ్య ,నారాయణ,అంకు భాయ్, పోషం , సికిందర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment