Sunday, 27 November 2016

అక్రమ ఇసుకకు చెక్

అక్రమ ఇసుకకు చెక్
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బన  మండలం లో అక్రమ ఇసుక రవాణా రాత్రి  పగలు కొనసాగుతున్న తరుణంలో కొమురం భీం జిల్లా పాలనా అధికారి చంపక్ లాల్ ఆదేశాల మేరకు ఆదివారం తాసిల్దారు రమేష్ గౌడ్ సమక్షంలో గొల్లగూడ లక్ష్మీపూర్ , కొండపెల్లి, గోలేటి ఎక్స్  రోడ్  లా వద్ద చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా తాసిల్దార్ రమేష్ గౌడ్ మాట్లాడుతూ అక్రమ ఇసుక రవాణా అరికట్టడం కోసం ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు చెక్ పోస్ట్ నిర్వహించటం జరిగింది అన్నారు. కార్యాలయం సిబ్బంది రాత్రి పగలు దశల వారీగా డ్యూటీ లను  కొనసాగిస్తూ అక్రమ ఇసుకను అరికడతామన్నారు.ఇక మేరకు ఎటువంటి  అనుమతి పత్రాలు లేకుండా ఇసుకను రవాణా చేసినచో చట్ట రీత్యా చెర్యలు తీసుకుంటామన్నారు. వీరితో పటు కార్యాలయం సిబ్బంది ఉమ్ లాల్  నాందేవ్ బాపు విట్టల్ చంద్రయ్య  తదితరులు వున్నారు.   

No comments:

Post a Comment