Thursday, 3 November 2016

నూతన భవనంలో తరగతులు ప్రాంభించక పోతే నిరాహార దీక్ష చేస్తాం

నూతన  భవనంలో తరగతులు ప్రాంభించక పోతే నిరాహార దీక్ష చేస్తాం   

కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బనలో ప్రభుత్వ జూనియర్ కళాశాల కొరకు నూతనంగా నిర్మించిన భవనంలోవెంటనే తరగతులను ప్రారంభించాలని ,లేని పక్షంలో  ఎ ఐ ఎస్ ఏఫ్  అధ్యర్యంలో నిరాహార దీక్ష చేస్తామని  రాష్ట్ర కార్యవర్గ దుర్గ రవీందర్ తెలియజేశారు . ఈ సందర్భంగా నూతన భవనంముందు ధర్నా నిర్వహంచిన అoనతరం నాయకులూమాట్లాడుతూ గత విద్య సంవత్సరం ఎం ఎల్ ఎ  కోవ లక్ష్మి గారు ప్రారంభించలని కాని నేటీ వరకు నూతన భవనంలో విద్యుత్ సౌకర్యం లేదనే కుంటి సారుతోతరగతతులను నిర్వహించడములేదని పేర్కొన్నారు . అధికార్ల , ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యతో 2 సంవత్సరాల నుండి మందు బాబులకు అడ్డా గా ఆరిందని ఆవేదన వ్యక్తం చేశారు . పాఠశాల , కళాశాల తరగతులు ఒకే ప్రాంగణములో  నిర్వహించడముతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు . ఇప్పటికైనా అధికారులు స్పందించించి వెంటనే కళాశాల ను నూతన భావనములోనికి మార్చాలని పేర్కొన్నారు . లేనిచో ఆందోళలు ఉదృతం చేస్తామని హెచచరించారు . ఈ కార్య క్రమములో డివిజన్ కార్య దర్శి పుదారి సాయి , మండల అధ్యక్షుడు మహిపాల్,  కార్య దర్శి, ప్రదీప్  , నాయకులు పార్వతి సాయి , గౌతమ్ , సందీప్ లు ఉన్నారు .

No comments:

Post a Comment