కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) దేశ ప్రజలకు,విద్యార్థులకు,నిరుద్యోగ యువత కు కేంద్ర ప్రభుత్వం చేసింది ఏమి లేదని ఏ ఐ వై ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు బోగే ఉపేందర్,ఏ ఐ ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దుర్గం రవీందర్ ,డివిజన్ కార్యదర్శి పూదరి సాయికిరణ్ aiyf మండల కార్యదర్శి సాలిగామ సంతోష్ లు అన్నారు. ఈ సందర్బంగా రెబ్బెన మండల కేంద్రం లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశం లో వారు మాట్లాడుతూ దేశం లోని పేద,బడుగు వర్గాల విద్యార్థులకు నిరుద్యోగ యువతకు విద్య, ఉపాధి హక్కుల కోసం, దళిత,ముస్లిం, గిరిజనులు,ఆదివాసుల మీద జరుగుతున్న దాడులు అరికట్టాలని ఈ నెల 22 వ తేదీన ఏ ఐ ఎస్ ఎఫ్,ఏ ఐ వై ఎఫ్ అధ్వర్యం లో పార్లమెంట్ మార్చ్ ని దేశం లోని విద్యార్థులు,నిరుద్యోగ యువత పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.అదే విదంగా ప్రైవేట్ రంగం లో రిజర్వేషన్ అమలు కోసం డిమాండ్ చేశారు.కేంద్రం లో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత దేశం లో అనేక సమస్యలు, సంఘటనలు ఉత్పన్నం అవుతున్నాయని,విద్యారంగానికి నిధులు కేటయించకుండ,విద్యారంగం లో బిజెపి విధానాలకు అనుకూలంగా మత విద్యను పాఠ్య అంశాలలో ప్రవేశాపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఎడ్యుకేషన్ సిస్టన్ 2016 పాలసీ ని విరమించుకోవాలని, విద్య వ్యాపారం ,మతపరమైన మూఢ నమ్మకాల విద్య విధానం, విదేశీవిశ్వవిద్యాలయాలను అరికట్టాలని వారు డిమాండ్ చేశారు.ఉచిత విద్య సమానమైన శాస్త్రీయ సాంకేతిక విద్య విధానం అందరికి అందుబాటులో కి తేవాలని అందరికి ఉద్యోగాలు కల్పించేందుకు భగత్ సింగ్ జాతీయ ఉపాధి రోజ్ గర్ యాక్ట్ ను అమలు చేయాలనీ డిమాండ్ చేశారు.పార్లమెంట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
No comments:
Post a Comment