నూతన భవనంలో తరగతులు త్వరగా ప్రారంభించాలి --ఏ ఐ ఎస్ ఎఫ్
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బనలో ప్రభుత్వ జూనియర్ కళాశాల కొరకు నూతనంగా నిర్మించిన భవనంలో వెంటనే తరగతులను ప్రారంభించాలని ఏ ఐ ఎస్ ఎఫ్ నాయకుడు సందీప్ ఆధ్వర్యంలో కొమురం భీం జిల్లా పాలనా అధికారి చంపాలాల్ కి వినతి పత్రం అందచేశారు అనంతరం నాయకులూ మాట్లాడుతూ గత విద్య సంవత్సరం ఎం ఎల్ ఎ కోవ లక్ష్మి గారు ప్రారంభించిన భవనం కాని నేటీ వరకు నూతన భవనంలో విద్యుత్ సౌకర్యం లేదనే కుంటి సాకుతో తరగతులను నిర్వహించడములేదని పేర్కొన్నారు .రెబ్బెనలో పాఠశాల , కళాశాల తరగతులు ఒకే ప్రాంగణములో నిర్వహించడముతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు . ఇప్పటికైనా అధికారులు స్పందించించి వెంటనే కళాశాల ను నూతన భావనములోనికి మార్చాలని పేర్కొన్నారు. ఈ కార్య క్రమములో మండల అధ్యక్షుడు ప్రదీప్ ,నాయకులూ సాయి కుమార్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు .
No comments:
Post a Comment