స్థానికులకు పనులు కల్పించాలి -సొల్లు లక్ష్మి
కొమురం బీమ్, (రెబ్బెన వుదయం ప్రతినిధి) ; సింగరేణి ఓ బి లలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని టి డి పి జిల్లా మహిళా అధ్యక్షురాలు సొల్లు లక్ష్మి అన్నారు . గోలేటిలోని జి ఎం కార్యాలయం ముందు స్థానిక యువకులతో ధర్నా నిర్వహించారు . అనంతరం జి ఎం కె రవిశంకర్ కు వినతి పత్రాన్ని ఇచ్చ్చారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ స్థానిక యువకులకు పని కల్పిస్తే నిరుద్యోగ సమస్య తీరుతుందని ఆమె తెలిపారు . ఇతర జిల్లా వాసులకు , రాష్ట్రాల వారికి పని ఇస్తున్నారని , కానీ లోకల్ వారికి తప్పకుండ పనులు కల్పించాలని డిమాండ్ చేశారు . లేనిచో టిడిపి ఆధ్వర్యములో ఆందోళనలు తీవ్ర ము చేస్తామని హెచ్చ్చరించారు.
No comments:
Post a Comment