Saturday, 19 November 2016

కార్మికుల హక్కులను కాపాడేది ఏఐటీయూసీ ఒక్కటే :వాసిరెడ్డి సీతరామయ్య

కార్మికుల హక్కులను కాపాడేది ఏఐటీయూసీ ఒక్కటే :వాసిరెడ్డి సీతరామయ్య

 

కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) సింగరేణి కార్మికుల  హక్కులను సాధించి,హక్కులను కాపాడే సంఘం ఏఐటీయూసీ ఒక్కటే అని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ప్రధాన కార్యాదర్శి వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. శనివారం నాడు రెబ్బెన మండలం గోలేటి ఏరియా కైరిగూడ ఓపెన్ కాస్ట్ లో నిర్వహించిన  ద్వారా సమావేశం లో పాల్గొని ఆయన మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ నిరంతరం పోరాటం నిర్వహిస్తుందని అన్నారు. గత రెండు నెలల క్రితం నిర్వహించిన పోరు యాత్ర ఫలితంగానే సింగరేణి కార్మికుల కు సకలజనుల సమ్మె కాలపు వేతనాలు విడుదల అయినవని ,రాష్ట్ర ప్రభుత్వం,యాజమాన్య విధానాల వల్ల అందరికార్మికులకు సమ్మె కాలపు వేతనాలు  అందక పోవడం బాధాకరం అని అన్నారు. సకల జనుల సమ్మెకాలపు  వేతనాలు అందరి కార్మికులకు  ఇప్పించడం  లో  గుర్తింపు సంఘం అయిన టిబిజికేఎస్  పూర్తిగ విఫలం అయిందని అన్నారు.సింగరేణి లో వారసత్వ ఉద్యోగాలకు చట్టబద్ధత కల్పించాలని,ఆర్ ఎల్ సి సమక్షంలో ఒప్పందం చేసుకోవాలని అన్నారు. లేని పక్షం లో బోర్డు అఫ్ డైరెక్టర్స్ సమావేశం లో దినిని రద్దు చేసే అవకాశం ఉంటుంది దీనివల్ల కార్మికులకు అన్యాయం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన హామీ ప్రకారం షరతులు లేని వారసత్వఉద్యోగాలను అమలు చేయాలనీ డిమాండ్ చేశారు.గతం లో టిబిజికెఎస్ లో ఉన్న గ్రూప్ తగాదాల వల్ల  వాళ్లు వాళ్ళు కొట్టుకోవడమే సరిపోయిందని కార్మికులకు చేసింది శూన్యం అని అన్నారు. ఆ రెండు గ్రూపు లు చాలవు  అన్నట్టు గ మూడో గ్రూపు  వెంకట్రావ్ వర్గం వచ్చి చేరిందని అన్నారు.టిబిజికెఎస్  కార్మికుల సమస్యలు పరిష్కరించకపొగ జైలు పాలయ్యి కోర్టు ల చుట్టూ తిరుగుతూ నాలుగు సంవత్సరాల కాలాన్నీ వృధా చేసి కార్మిక  వర్గానికి తీరని అన్యాయం చేసిందని అన్నారు.ఏఐటీయూసీ నిర్వహించిన పోరుయాత్ర ఫలితంగానే వారసత్వ ఉద్యోగాల ప్రకటన జరిగిందని అన్నారు. నిరంతరం కార్మికులసమస్యల పరిష్కారం  కోసం పోరాడుతున్న ఏఐటీయూసీ ని కార్మికులు ఆదరించాలని ఆయన కోరారు. ఏఐటీయూసీ కి ఆకర్షితులై  ఖైరిగూడ ఓపెన్ కాస్ట్ లోని ఈపి ఆపరేటర్ కార్మికులు 30 మంది సంఘం లో చేరడం జరిగింది. వారికీ వాసిరెడ్డి సీతారామయ్య కండువాలు కప్పి ఆహ్వానించడం జరిగింది. ఈ సమావేశం లో ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి ఎస్.తిరుపతి,ఉపాధ్యక్షులు బయ్యా మొగిలి,ఆర్గనైజింగ్ కార్యదర్శులు బి.జగ్గయ్య,సోకాలశ్రీనివాస్,.శివరావు,శేషసేయణరావు [శేషు]ఫిట్ కార్యదర్శి డి.ఈశ్వర్ రెడ్డి, అసిస్టెంట్ కార్యదర్శి దివాకర్,షిఫ్ట్ ఇంచార్జి లు జూపాక రాజేష్,చంద్రశేఖర్,ఏంఆర్.చారీ, సత్యనారాయణ,నాయకులు కిరణ్,ఎం.సత్యనారాయణ,జాడి స్వామీ,పూదరిసాయికిరణ్,కార్మికులు పాల్గొన్నారు. ఏఐటీయూసీ లో చేరిన కార్మికు ఎన్.నరేష్,పరంధామయ్య,ఎస్.రమేష్,సి.లింగయ్య,గజ్జెల.శ్రీనివాస్,ఎ.శ్రీనివాస్ రెడ్డి,జె.మహేందర్,పీ.వెంకటేష్,జె.లక్ష్మణ్,కె.పోచం,జి.మల్లయ్య,నవీన్,బందం రమేష్, పలువురు కార్మికులు చేరడం  జరిగింది.

















No comments:

Post a Comment