యోగా పోటీల్లో ప్రతిభ కనబర్చిన గోలేటి మహిళలు
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలం లోని గోలేటికి చెందిన మహిళలు యోగా పొటిలలో ప్రతిభ కనబర్చి పతకాలు సాధించినట్లు యోగా మాస్టర్ రెవెల్లి రాయలింగు తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ ఉషోదయ పాఠశాలలో సోమవారం యోగా అసొసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా పోటీల్లో కుమ్రం భీం జిల్లా లోని గోలేటికి చెందిన దేవేంద్ర 40-50 వయస్సు కేటగిరిలో బంగారు పతకం, కొండు లత ద్వితీయ స్థానాన్ని కైవాసం చేసుకోగా, మూడవ స్థానాన్ని పత్త0 అలెఖ్య దక్కించుకుంది. గతంలో వీరు కోల్‌కత్తాలో నిర్వహించిన యోగా శిబిరాల్లో సైతం తెలంగాణ రాష్ట్రం తరుపున పాల్గొని బహుమతులు సాధించినట్లు తెలిపారు.
No comments:
Post a Comment