కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) ఎస్సీ వర్గీకరణ జరిగి తీరుతుందని దానికి అందరు సహకరించాలని ఎమ్.ఆర్.పి.ఎస్ జిల్లా అధ్యక్షుడు శరత్ అన్నారు.రెబ్బెన అతిధి గృహంలో మంగళవారంనాడు ఎమ్.ఆర్.పి.ఎస్ నాయకులూ ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా అధ్యక్షుడు శరత్ హాజరై మాట్లాడుతు ఆదివారం నిర్వహించిన ధర్మ యుద్ధ బహిరంగ సభ కు హాజరయ్యి విజయవంతం చేసిన నాయకులకు,కులస్థులకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఎట్టి పరిస్థితిల్లొనైనా ఎస్సీ వర్గీకరణ జరిగితీరుతుందని అయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఎం ఆర్ పి ఎస్ నాయకులూ లింగంపల్లి ప్రభాకర్,అరికెల్ల మొగిలి,గోగర్ల రాజేష్,చిలుముల నర్సింగం,బొంగు నర్సింగరావు,తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment